
అనుదీప్ కెవి డైరక్షన్ లో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్ధుల్లా కలిసి నటించిన సినిమా జాతిరత్నాలు. శివరాత్రి సందర్భంగా మార్చ్ 11న రిలీజైన ఈ సినిమా అంతటా సూపర్ హిట్ కలక్షన్స్ రాబట్టింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ రెండు వారాలు జాతిరత్నాల హవా నడిచింది. ఇక యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా జతిరత్నాల సందడి బాగానే ఉందని తెలుస్తుంది. ఆఫ్టర్ కోవిడ్ యూఎస్ లో హిట్టైన సినిమాగా జాతిరత్నాలు సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు యూఎస్ లో ఈ సినిమా 1 మిలియన్ మార్క్ కలక్షన్స్ సాధించింది.
సినిమాను తక్కువ సెంటర్స్ లో రిలీజ్ చేసినా సరే మౌత్ టాక్ తో పాటుగా చిత్రయూనిట్ స్పెషల్ గా యూఎస్ లో కూడా ప్రమోషన్స్ చేయడంతో సినిమాకు ఈ రేంజ్ కలక్షన్స్ వచ్చాయి. జాతిరత్నాలు 1 మిలియన్ మార్క్ వసూళ్లు రాబట్టడం మూవీ యూనిట్ కు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. స్వప్నా సినిమాస్ బ్యానర్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హిట్ అందుకున్న నవీన్ పొలిశెట్టి జాతిరత్నాలు సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ సాధించాడు.