కాజల్ ఇక వాటికి సిద్ధమట..!

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ ఫేడవుట్ అవడం కామన్. కాని సమంత ఆ సెంటిమెంట్ కు మంగళం పాడేసింది. పెళ్లైనా సరే వరుస సినిమాలతో సమంత సత్తా చాటుతుంది. ఇక ఇప్పుడు ఆమె బాటలోనే మరో స్టార్ హీరోయిన్ వరుస ఛాన్సులు అందుకుంటుంది. స్నేహితుడు గౌతం కిచుని రీసెంట్ గా పెళ్లాడింది కాజల్ అగర్వాల్. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తుంది. లాస్ట్ వీక్ మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాజల్.

పెళ్లి తర్వాత కాజల్ కెరియర్ మీద మరింత ఫోకస్ పెట్టిందని తెలుస్తుంది. అందుకే ఇక మీదట గ్లామర్ షోకి రెడీ అంటూ హింట్ ఇస్తుంది. అంతేకాదు క్యారక్టర్ డిమాండ్ చేయాలే కాని నెగటివ్ రోల్స్ కూడా చేసేందుకు సిద్ధమని చెబుతుంది అమ్మడు. స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకున్న కాజల్ విలన్ గా కూడా మెప్పించడానికి సై అంటుంది. ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సీరీస్ లో సమంత నెగటివ్ రోల్ చేసిందని తెలిసిందే. కాజల్ కూడా సమంత బాటలోనే ఎలాంటి పాత్రలైనా చేసేందుకు రెడీ అని చెబుతుంది.