హ్యాపీ బర్త్ డే మై బోయ్.. చిరు స్పెషల్ వీడియో..!

తనయుడు చరణ్ బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియో తన సోషల్ బ్లాగుల్లో రిలీజ్ చేశారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎల్లప్పుడూ.. తండ్రి ని జాగ్రత్తగా చూసుకునే కొడుకు అంటూ.. హ్యాపీ బర్త్ డే మై బోయ్ అని చిరు తనయుడికి బర్త్ డే విషెస్ అందించారు. చిరు తనయుడిగా అదే స్టార్ ఇమేజ్ ను కొనసాగించడంలో సక్సెస్ అయ్యాడు చరణ్. చిరుత నుండి రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ వరకు చరణ్ తన నట విశ్వరూపం చూపిస్తూ వస్తున్నాడు.

అంతేకాదు ఈ ఇయర్ ఆచార్యతో చిరు, చరణ్ ఇద్దరు ఒకే సినిమాలో కనిపించనున్నారు. ఆచార్యలో సిద్ధ పాత్రలో చరణ్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్ శనివారం రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. చరణ్ బర్త్ డే వేడుకలను ఫ్యాన్స్ సమక్షంలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఆచార్య, ఆర్.ఆర్.ఆర్ ఈ రెండు సినిమాలతో నటుడిగా చరణ్ మరో పదిమెట్లు ఎక్కుతాడని చెప్పొచ్చు. రంగస్థలంతో పరిపూర్ణ నటుడిగా ప్రేక్షకుల మనసులు గెలిచిన చరణ్ ఇక మీదట విలక్షణ పాత్రల్లో కనిపించి అలరిస్తాడని చెప్పొచ్చు.