
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా F3. సూపర్ హిట్ మూవీ F2 సినిమాకు కొనసాగింపుగా ఈ సినిమా వస్తుంది. అనీల్ రావిపుడి ఈ క్రేజీ సీక్వల్ కూడా ఏమాత్రం రేంజ్ తగ్గకుండా చేస్తున్నారట. F3 సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా లేటెస్ట్ గా సినిమాలో మరో హాట్ బ్యూటీ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ F3 లో నటించే ఆ ముద్దుగుమ్మ ఎవరు అంటే బాలయ్యతో రెండు సినిమాల్లో నటించిన సోనాల్ చౌహన్ అని తెలుస్తుంది.
తన అందంతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్న సోనాల్ కెరియర్ లో మరో సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. బాలకృష్ణ సినిమాల్లో అందాల విందు అందించినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేదు. అందుకే ఈసారి ఫ్యామిలీ సినిమాతో ప్రేక్షకులను అలరించాలని చూస్తుంది. సినిమాలో సోనాల్ ఎలాంటి పాత్ర చేస్తుంది అన్నది బయటకు రాలేదు. సూపర్ హిట్ సినిమా సీక్వల్ కాబట్టి తప్పకుండా సోనాల్ కు F3 తో లక్ కలిసి రావడం పక్కా అని అంటున్నారు.