
మార్చ్ 27 మెగా పవర్ స్టార్ రాం చరణ్ బర్త్ డే సందర్భంగా RRR టీం స్పెషల్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు రామరాజు టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా లేటెస్ట్ గా చరణ్ అల్లూరి సీతారామరాజుగా విల్లు ఎక్కు పెడుతున్న పోస్టర్ వదిలారు. విల్లు ఎక్కుపెట్టి నింగివైపు చూస్తున్న రామరాజుగా చరణ్ లుక్ చూసి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రతి సినీ అభిమాని వావ్ అనేస్తున్నారు.
బాహుబలి తర్వాత ఆ సినిమా అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. వాటికి ఈ ప్రచార చిత్రాలు బలం చేకూరుస్తున్నాయని చెప్పొచ్చు. సీతా రామరాజుగా చరణ్ ఆహార్యం చూసి చిరుత నుండి ఆర్.ఆర్.ఆర్ వరకు చరణ్ కెరియర్ గ్రాఫ్ చూసి అందరు శభాష్ అనాల్సిందే. చిరు వారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్నాడు చరణ్. ఆర్.ఆర్.ఆర్ మాత్రమే కాదు చిరుతో కలిసి ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నాడు చరణ్.