నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ..!

మెగా బ్రదర్ నాగబాబు బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అదికూడా ఓ తెలుగు సినిమా రీమేక్ తో హిందీలో నటిస్తున్నారు నాగబాబు. ఆయన నటించే సినిమా ఏది అంటే తెలుగు ఛత్రపతి రీమేక్ అని తెలుస్తుంది. రాజమౌళి డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. ప్రభాస్ కు మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.

వి.వి.వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. హిందీ ఛత్రపతి సినిమాలో బెల్లంకొండ బాబుకి విలన్ గా మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది. నెగటివ్ రోల్ కోసం నాగబాబు స్పెషల్ ఫోటో షూట్ జరిపినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగబాబుకి సంబందించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి విలన్ గా నాగబాబు హిందీ ఆడియెన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి.