
బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సూపర్ స్టార్డం తెచ్చుకోగా ఇప్పుడు తమిళ పరిశ్రమలో కూడా అమ్మడు పాగా వేయాలని చూస్తుంది. కోలీవుడ్ సినిమా మూగమూడితోనే తెరంగేట్రం చేసిన అమ్మడు ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది. మళ్లీ 9 ఏళ్ల తర్వాత కోలీవుడ్ నుండి ఆఫర్ అందుకుంది అమ్మడు. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లీడ్ రోల్ లో నెల్సన్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో ఛాన్స్ అందుకుంది పూజా హెగ్దే.
అందం అభినయం రెండిటితో సత్తా చాటుతున్న పూజా హెగ్దే తెలుగు ఆడియెన్స్ ను తన బుట్టలో వేసుకుంది. ఇక ఇప్పుడు తమిళ ఆడియెన్స్ మీద దృష్టి పెట్టింది. విజయ్ 65వ సినిమాలో పూజా హెగ్దే ఫిక్స్ అని చిత్రయూనిట్ ప్రకటించింది. విజయ్ సినిమాతో తమిళంలోకి రీ ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్దే అక్కడ కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పొచ్చు. మరి అమ్మడు ఈ సినిమాతో ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.