
కేరాఫ్ కంచెరపాలెంతో ప్రశంసలు అందుకుని ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరక్టర్ వెంకటేష్ మహా యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్ లో ఉన్నా కూడా సినిమాకు సంబందించిన టైటిల్, ప్రీ లుక్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. వెరైటీ కంటెంట్ మాత్రమే కాదు వెరైటీ టైటిల్స్ పెట్టడంలో కూడా తనకు తిరుగులేదని అనిపించుకుంటున్నాడు వెంకటేష్ మహా.
రాజశేఖర్ తో వెంకటేష్ మహా చేస్తున్న సినిమాకు టైటిల్ గా మర్మాణువు అని ఫిక్స్ చేశారు. పోస్టర్ కూడా వెరైటీగా పుర్రెకి రాజు తలపాగా పెట్టి ఉంచారు. ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్న ఈ ప్రీ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. అంతేకాదు రెండు సినిమాలకే తనకంటూ ఒక మార్క్ వేసుకున్న వెంకటేష్ మహా ఈ సినిమాతో కూడా అదే తరహా వెరైటీగా వస్తాడని తెలుస్తుంది. రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోతో వెంకటేష్ మహా చేస్తున్న ఈ మర్మాణువు సినిమా ఎలా ఉంటుందో చూడాలి.