వెంకటేష్ తో శేఖర్ కమ్ముల..!

విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో సూపర్ స్పీడ్ మీద ఉన్నారు. ఎఫ్2, వెంకీమామ హిట్ తో ఫాం లోకి వచ్చిన వెంకీ ప్రస్తుతం నారప్ప, ఎఫ్3 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా దృశ్యం 2 సినిమాకు సైన్ చేశారు వెంకటేష్. ఇక కమిటైన ఈ సినిమాలన్ని పూర్తి కాగానే తన నెక్స్ట్ సినిమా సెన్సిబుల్ డైరక్టర్ శేఖర్ కమ్ములతో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ కాంబినేషన్ లో సినిమాకు కథా చర్చలు జరిగాయని ఫిల్మ్ నగర్ టాక్.

వెంకటేష్, శేఖర్ కమ్ముల కాంబో మూవీని నారాయణ దాస్ నారంగ్, పుష్పక్ రాం మోహన్ రావ్ నిర్మిస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల చేస్తున్న లవ్ స్టోరీ సినిమాను కూడా ఈ నిర్మాతలే రూపొందిస్తున్నారు. శేఖర్ కమ్ముల వర్కింగ్ స్టైల్ నచ్చి వెంకటేష్ తో ఈ నిర్మాతలు సినిమా ఫిక్స్ చేసుకున్నారు. శేఖర్ కమ్ముల కూడా లవ్ స్టోరీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. లవ్ స్టోరీ హిట్ పడితే వెంకీ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. వెంకటేష్ కోసం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ రెడీ చేశాడట శేఖర్ కమ్ముల.