
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాగర్ చంద్ర డైరక్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటుగా రానా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ ఫిక్స్ చేయగా పవన్ కళ్యాణ్ కు జతగా మొదట్లో సాయి పల్లవిని తీసుకోవాలని అనుకున్నారు. కాని ఆమె ఎందుకో ఈ ప్రాజెక్ట్ చేయడం కుదరదని చెప్పినట్టు టాక్.
అందుకే ఏకే తెలుగు రీమేక్ లో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. మళయాళ పరిశ్రమ నుండి వచ్చిన నిత్యా మీనన్ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. అయితే ఈమధ్య తెలుగులో పెద్దగా అవకాశాలు లేని అమ్మడు అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది. పవన్ సినిమాలో ఛాన్స్ రాగానే ఓకే చెప్పింది. మరి ఈ సినిమాతో అయినా నిత్యా మళ్లీ తెలుగులో బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.