
ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో మెప్పించిన యువ హీరో నవీన్ పొలిశెట్టి రీసెంట్ గా వచ్చిన జాతిరత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. జాతిరత్నాలులో జోగిపేట్ శ్రీకాంత్ పాత్రలో నవీన్ పొలిశెట్టి అదరగొట్టాడు. అందుకే అతనితో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో యువి క్రియేషన్స్ ఆల్రెడీ నవీన్ తో ఓ సినిమా ఫిక్స్ చేసుకుందని తెలుస్తుంది. ఈ సినిమాలో స్వీటీ అనుష్క హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.
రెండు సినిమాలతోనే అనుష్కతో జోడీ కట్టే ఛాన్స్ అందుకున్నాడు నవీన్. అనుష్కతో నవీన్ అనగానే లక్ అంటే అతనిదే అనేస్తున్నారు. రారా కృష్ణయ్య సినిమా డైరక్టర్ మహేష్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా Ms శెట్టి.. Mr పోలిశెట్టి అని పెట్టినట్టు తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ కాంబో మాత్రమే కాదు ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కూడా ఈ సినిమా వస్తుంది. మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో బయటకు వస్తాయి.