నాగార్జున 100వ సినిమాకు భారీ ప్లాన్..!

కింగ్ నాగార్జున 100వ సినిమా ప్లాన్ ఇప్పటినుండే మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. 96వ సినిమాగా వైల్డ్ డాగ్ వస్తుండగా 97వ సినిమా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు నాగార్జున. ఇక మధ్యలో బంగార్రాజు సినిమా కూడా లైన్ లో ఉంది. ఇక దాని తర్వాత 100వ సినిమా కెరియర్ లో నిలిచిపోయేలా సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 

బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు అదే తరహాలో నాగ్ తన 100వ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య, అఖిల్ ఇద్దరు ఉంటారని టాక్. అఖిల్ కు ఫుల్ లెంగ్త్ రోల్ గా.. చైతుకి గెస్ట్ రోల్ గా ఉండేలా కథ సిద్ధం చేయిస్తున్నారట. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ డైరక్టర్ ఎవరు.. ఏ జానర్ లో ఈ సినిమా వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నాగ్ 100వ సినిమా చాలా ప్రత్యేకంగా అక్కినేని అభిమానులకు, సినీ ప్రేక్షకులను స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని అంటున్నారు.