
కోలీవుడ్ హీరో కార్తీ హీరోగా బక్కియరాజ్ కన్నన్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా సుల్తాన్. వందమంది విలన్ గ్యాంగ్ తనతో ఉండగా తను ప్రేమించిన అమ్మాయి గురించి ఓ ఊరు ఇబ్బందుల్లో పడితే.. అప్పుడు తన సైన్యంతో హీరో ఏం చేశాడు అన్నది సుల్తాన్ కథ. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా మరోసారి కార్తీకి ఖైదీ మార్క్ హిట్ అందించేలా ఉందని చెప్పొచ్చు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే కార్తీ కోరుకునే హిట్ దక్కినట్టే అని చెప్పొచ్చు.
కార్తీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ఎస్పి ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్ ప్రభు నిర్మించారు. ఏప్రిల్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఏప్రిల్ 2న కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకు సుల్తాన్ ఎలాంటి టఫ్ ఫైట్ ఇస్తాడో చూడాలి.