
నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. మార్చ్ 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొట్టినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా చెక్ సినిమా డిజాస్టర్ అయినా నితిన్ రంగ్ దేకి మంచి బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా రంగ్ దే సినిమాకు 24 కోట్ల బిజినెస్ అయ్యిందని తెలుస్తుంది.
ఈ సినిమాకు నైజాం 7.6 కోట్లు బిజినెస్ రాగా.. సీడెడ్ 3.7 కోట్లు వచ్చాయట. ఆంధ్రా 10 కోట్ల బిజినెస్ చేసింది రంగ్ దే. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 21.3 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.2 కోట్లు బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ 1.5 కోట్ల దాకా బిజినెస్ చేసిందని తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా నితిన్ రంగ్ దే 24 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ కొట్టాలి అంటే పాతిక కోట్ల దాకా వసూళు చేయాలి. భీష్మతో హిట్ అందుకున్న నితిన్ చెక్ తో నిరాశపరచినా మళ్లీ రంగ్ దేతో ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.