కప్పెల రీమేక్.. బుట్టబొమ్మ టైటిల్ ఫిక్స్..!

మళయాళ మూవీ కప్పెల సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. యూత్ ఆడియెన్స్ ను మెప్పించిన కప్పెల సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ముస్తఫా డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అన్నే బెన్, శ్రీనాథ్ భాసి, రోషన్ మాధ్యు నటించిన కప్పెల మూవీ అక్కడ సెన్సేషనల్ హిట్ అందుకుంది.

ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ రీమేక్ చేస్తున్నారు. సినిమాకు టైటిల్ గా బుట్టబొమ్మ అని ఫిక్స్ చేసినట్టు టాక్. అయితే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు.. కాస్టింగ్ ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు. మళాయళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ సితార బ్యానర్ లోనే వస్తుంది. ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్నారు. సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండటం విశేషం.