టక్ జగదీష్ వెరైటీ ప్రమోషన్స్..!

నాచురల్ స్టార్ నాని హీరోగ శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ నిన్ను కోరి సినిమాతో హిట్ అందుకున్న ఈ కాంబో మరోసారి టక్ జదీష్ తో ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు. టక్ జగదీష్ సినిమా నుండి ఈమధ్యనే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఏప్రిల్ 23న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నట్టు తెలుస్తుంది. సినిమా రిలీజ్ కు ఇంకా నెల రోజులే ఉన్న కారణంగా ఈ నెల 27న సినిమా పరిచయ వేడుక ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఆ తర్వాత మరో వారం రోజుల్లో మరో ఈవెంట్.. ఫైనల్ గా సినిమా రిలీజ్ కు ముందు మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ముచ్చటగా మూడు మెగా ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు టక్ జగదీష్ టీం. చూస్తుంటే నాని ఈసారి గట్టి టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. వి సినిమాతో నిరాశపరచిన నాని టక్ జగదీష్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా నాని శ్యాం సింగ రాయ్, అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు.