
ప్రభు సోల్మన్ డైరక్షన్ లో రానా లీడ్ రోల్ లో నటించిన సినిమా అరణ్య తమిళంలో కాదన్.. హిందీలో హాతీ మేరే సాథీగా రిలీజ్ అవుతుంది. మార్చ్ 26న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా హిందీ వర్షన్ రిలీజ్ వాయిదా పడినట్టు తెలుస్తుంది. సినిమా నిర్మాతలు ఈరోస్ ఇంటర్నేషనల్ వారు లేటెస్ట్ గా రానా సినిమా హిందీ వర్షన్ రిలీజ్ ఆగిపోయినట్టు ప్రకటించారు. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటం వల్ల ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడుతూ వచ్చాయి.. రిలీజైన కొన్ని సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెళ్లడించారు నిర్మాతలు.
హిందీ వర్షన్ ఆగిపోయినా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా అనుకున్న విధంగా మార్చ్ 26న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఏనుగుల సంరక్షకుడిగా రానా నటన అద్భుతంగా ఉందని చిత్రయూనిట్ చెబుతున్నారు. సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తి పెంచగా తప్పకుండా అంచనాలను మించేలా ఈ సినిమా ఉంటుందని చెప్పొచ్చు. మార్చ్ 26న సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.