
మళయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమాకు రీమేక్ గా తెలుగులో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సాగర్ చంద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం 25 రోజుల డేట్స్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందే. సినిమాలో రానాకి జోడీగా ఐశ్వర్యా రాజేష్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. మళయాళ మూవీలో పృధ్విరాజ్ చేసిన పాత్రలో రానా నటిస్తున్నారు. అక్కడ బిజూ మీనన్ రోల్ లో పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. పవన్ కు జోడీగా సాయి పల్లవిని అడుగుతున్నారని టాక్. మొత్తానికి పవన్, రానాలకు జతగా యంగ్ హీరోయిన్స్ ను సెలెక్ట్ చేస్తున్నారు.