ప్రభాస్ తో దిల్ రాజు..!

బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండేలా చూస్తున్నాడు. సాహో అంచనాలను అందుకోకపోయినా త్వరలో రాబోతున్న రాధేశ్యాం సినిమా సత్తా చాటుతుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్.. ఓం రౌత్ డైరక్షన్ లో ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని టాక్. సినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ లాంటి క్రేజీ స్టార్స్ నటిస్తున్నారు.

ఈ సినిమాల తర్వాత ప్రభాస్ తో దిల్ రాజు సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ హీరోగా మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలను నిర్మించాడు దిల్ రాజు. ఇప్పుడున్న ప్రభాస్ మార్కెట్ కు అనుగుణంగా భారీ బడ్జెట్ తో క్రేజీ పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో ఉన్నారట. ఆ ప్రాజెక్ట్ కు డైరక్టర్ ఎవరన్నది మాత్రం తెలియాల్సి ఉంది. రీసెంట్ గా దిల్ రాజు.. రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో భారీ మూవీ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.