
RRR సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కలిసి చేస్తున్న సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ భామ రష్మిక మందన్నని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే వస్తుందని టాక్. కన్నడ పరిశ్రమ నుండి వచ్చి తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది రష్మిక. ఆమె చేస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు అందుకుంటుంది. అందుకే దర్శక నిర్మాతలు ఆమె కోసం క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక. ఈ సినిమాతో పాటుగా కోలీవుడ్ హీరో కార్తీ సరసన సుల్తాన్ సినిమాలో కూడా అమ్మడు నటిస్తుంది. తారక్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా రష్మికని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ తో రష్మిక మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. స్టార్ హీరోల్లో మొదట మహేష్ తోనే జత కట్టిన రష్మికకు ఇక మీదట వరుస స్టార్ ఛాన్సులు వస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.