తలైవి ట్రైలర్.. కంగనా నట విశ్వరూపం..!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత జయలలిత జీవిత కథతో వస్తున్న సినిమా తలైవి. ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తెర మీద జయలలితగా నటిస్తున్నారు బాలీవుడ్ భామ కంగనా రనౌత్. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించిన తలైవి ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది.

జయలలిత సినీ ప్రస్థానం.. రాజకీయ రంగ ప్రవేశం.. రాజకీయ ప్రస్థానం ఇలా అన్ని విషయాలను బాగా చూపించారు. ట్రైలర్ లో మహాభారతానికి ఇంకో పేరుంది జయ అంటూ కంగనా చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. బయోపిక్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్న ఈ టైం లో ఆల్రెడీ సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సూపర్ హిట్ కాగా అదే తరహాలో వస్తున్న జయలలిత జీవిత కథ తలైవి తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పొచ్చు. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా ఏప్రిల్ 23న రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్.