
కెరియర్ లో వెనకపడ్డ మంచు హీరో మనోజ్ పర్సనల్ లైఫ్ డిస్టబెన్స్ ల వల్ల సినిమాల మీద దృష్టి పెట్టలేకపోయాడు. ఒకానొక దశలో సినిమాలకు గుడ్ బై చెప్పేందుకు కూడా రెడీ అయిన మనోజ్ మళ్లీ తన మనసు మార్చుకుని సినిమాలు చేస్తున్నాడు. మంచు మనోజ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా అహం బ్రహ్మస్మి. హీరోగానే కాదు ఆ సినిమా నిర్మాతగా కూడా అదనపు బాధ్యత మీద వేసుకున్నాడు మంచు మనోజ్.
శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపం చూపించాలని చూస్తున్నాడు మంచు హీరో. ఇక ఈ సినిమాలో స్పెషల్ కెమియో రోల్ గా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. మంచు మనోజ్, సాయి ధరం తేజ్ ఇద్దరు మంచి స్నేహితులు.. అందుకే మనోజ్ అడగ్గానే అహం బ్రహ్మస్మి సినిమాతో తేజ్ నటించడానికి సై అన్నాడట. ప్రస్తుతం దేవా కట్ట సినిమాలో రిపబ్లిక్ సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్ సుకుమార్ అసిటెంట్ డైరక్షన్ లో కూడా పిరియాడికల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి సినిమా చేస్తాడని టాక్.