
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడు. తను నటిస్తున్న సినిమాల్లో పాటలు పాడి ఫ్యాన్స్ ను అలరించే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న మళయాళ మూవీ రీమేక్ లో తన గొంతు సవరించుకుంటున్నారు. మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం సినిమాలో పవన్, రానా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాట పాడటం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అవనుంది.
సాగర్ చంద్ర డైరక్షన్ లో వస్తున్న ఈ రీమేక్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు. సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రం అందిస్తున్నారు. పవన్ నటించిన వకీల్ సాబ్ ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మళయాళ మూవీ రీమేక్ కూడా ఈ ఇయర్ దసరాకి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.