
సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట తర్వాత రాజమౌళితో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. పరశురాం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని అంటున్నారు. అయితే సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి సినిమాకు మధ్య గ్యాప్ లో ఓ సినిమా పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నాడు మహేష్.
ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ తో సినిమా ఎనౌన్స్ చేసినా ఆ సినిమాను రాజమౌళి సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆ గ్యాప్ లో మహేష్ మరో సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ మహేష్ ఏ డైరక్టర్ తో సినిమా చేస్తాడు అంటే మాటల మాంత్రికుడు త్రివిక్రం తో అని తెలుస్తుంది. అతడు, ఖలేజా సినిమాలతో ఈ కాంబో సూపర్ హిట్ అయ్యింది. అయితే మరోసారి ఈ ఇద్దరి కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుత్మ త్రివిక్రం తారక్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే మహేష్ తోనే త్రివిక్రం సినిమా ఉంటుందని టాక్. మరి అతడు.. ఖలేజా తర్వాత హ్యాట్రిక్ కాంబోలో వచ్చే ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.