
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆగష్టు 13న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో విలన్ ఎవరన్నది తెలుసుకోవాలని ఆడియెన్స్ లో ఓ ఎక్సయిట్మెంట్ ఉంది. ఫైనల్ గా సినిమాలో విలన్ ను ఎనౌన్స్ చేశారు చిత్రయూనిట్.
మళయాళ స్టార్ ఫాహద్ ఫాజిల్ ను పుష్ప విలన్ గా ఫిక్స్ చేశాడు సుకుమార్. మళయాళంలో స్టార్ క్రేజ్ ఉన్న ఫాహద్ ఫాజిల్ పుష్ప సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. నటుడిగా సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తున్న ఫాహద్ ఫాజిల్ పుష్ప సినిమాలో విలన్ గా తెలుగు ప్రేక్షకులను అలరిస్తాడని చెప్పొచ్చు. పుష్ప విలన్ గా విజయ్ సేతుపతి, అరవింద స్వామి, బాబీ సింహా, బాబీ డియోల్ వంటి వారి పేర్లు వినిపించాయి. అయితే సుకుమార్ రాసుకున్న విలన్ పాత్రకు ఫాహద్ ఫాజిల్ అయితేనే పర్ఫెక్ట్ అనుకుని అతన్ని ఫైనల్ చేశారు.