
67వ జాతీయ చలచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019వ సంవత్సరానికి గాను నామినేషన్స్ లో ఉన్న సినిమాల నుండి అన్ని విభాగాల్లో బెస్ట్ గా నిలిచిన వాటికి ఈ అవార్డులను ప్రకటించారు. 67వ నేషనల్ అవార్డ్ లిస్ట్ లో బెస్ట్ యాక్టర్ గా అసురన్ సినిమాలో ధనుష్ తో పాటుగా భోంస్లే సినిమా నుండి మనోజ్ బాజ్ పాయ్ కు ఈ అవార్డ్ దక్కింది. అంటే బెస్ట్ యాక్టర్ అవార్డుని ఇద్దరు షేర్ చేసుకుంటారన్నమాట. ఉత్తమ నటిగా మణికర్ణిక, పంగా సినిమాల్లో నటించిన కంగనా రనౌత్ ను ఎంపిక చేశారు.
టాలీవుడ్ విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి సినిమా ఉత్తమ వినోదాత్మక సినిమాగా నేషనల్ అవార్డ్ అందుకుంది. నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా ఉత్తమ తెలుగు సినిమాగా సెలెక్ట్ అయ్యింది. జెర్సీ సినిమాకు ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో కూడా అవార్డ్ దక్కింది. మహర్షి సినిమాకు ఉత్తమ కొరియోగ్రాఫర్, ఉతమ నిర్మాణ సంస్థ కేటగిరిల్లో అవార్డులు వరించాయి. తమ సినిమాలకు నేషనల్ అవార్డ్ రావడం పట్ల జెర్సీ, మహర్షి సినిమా యూనిట్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తపరిచారు.