మహాసముద్రంలో అనసూయ..!

ఆరెక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరక్టర్ అజయ్ భూపతి తన నెక్స్ట్ సినిమా భారీగా ప్లాన్ చేశారు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా క్రేజీ మల్టీస్టారర్ గా వస్తున్న సినిమా మహా సముద్రం. ఈ సినిమాలో ప్రియాంకా, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా స్మాల్ స్క్రీన్ హాట్ యాంకర్ అనసూయతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. బుల్లితెర మీద యాంకర్ గా అలరిస్తున్న అనసూయ సిల్వర్ స్క్రీన్ మీద కూడా తన సత్తా చాటుతుంది. సినిమాల్లో స్పెషల్ రోల్స్, ఐటం సాంగ్స్ చేస్తూ వస్తున్న అమ్మడు మహా సముద్రంలో కూడా స్పెషల్ సాంగ్ చేసేందుకు సైన్ చేసిందని తెలుస్తుంది. రీసెంట్ గా వచ్చిన కార్తికేయ చావు కబురు చల్లగా సినిమాలో అనసూయ ఐటం సాంగ్ చేసింది. మహా సముద్రం సినిమాలో అనసూయ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి.