
కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా మణికాంత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా తెల్లవారితే గురువారం. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చారు. తన కుటుంబం తర్వాత తన కష్ట సుఖాల్లో ఉన్న మరో కుటుంబం జక్కన్న ఫ్యామిలీ.. అందుకే ఇక్కడకి తాను గెస్ట్ గా కాకుండా కుటుంబ సభ్యుడిగా వచ్చానని అన్నారు తారక్. పాతికేళ్లుగా ఈ ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని గురించి చెప్పిన ఎన్.టి.ఆర్ తన కొడుకులను ఎలా పెంచాలన్నది కూడా వీరి నుండి నేర్చుకున్నానని అన్నారు.
ఇక ఈ ఈవెంట్ లో భాగంగా తెల్లవారితే గురువారం ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ విషయానికి వస్తే తెల్లవారితే పెళ్లి పెట్టుకుని సాధారణంగా పెళ్లికూతురు ఇంట్లోంచి వెళ్లిపోవాలని ప్రయత్నిస్తుంది. కాని ఈ సినిమాలో హీరో పెళ్లి తప్పించుకుని పారిపోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతకీ హీరో అలా ఎందుకు వెళ్లాడు. అసలు సినిమా కథ ఏంటన్నది ఈ శుక్రవారం తెలుస్తుంది. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించగా సినిమా కూడా ఆడియెన్స్ ను అలరిస్తుందని అనిపిస్తుంది.