ఏమో అనుకున్నా కానీ.. రానా అదరగొట్టాడు..!

టాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో దగ్గుబాటి రానా ఒకరు. హీరోగానే కాదు విలన్ గా కూడా ఆయన చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా రానా లీడ్ రోల్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా అరణ్య. ప్రభు సోల్మన్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుంది. మార్చ్ 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ రావడం విశేషం.

సినిమా చూసిన వెంకటేష్ రానాని చూసి స్టన్ అయ్యానని అన్నారు. అద్భుతంగా నటించి పాత్రలో రానా జీవించాడని చెప్పారు. భారత సినీ పరిశ్రమలో ఇలాంటి ఓ సినిమా వస్తున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా అని అన్నారు వెంకీ.. ఇది నేచర్ సినిమా.. అందరూ చూడాలని అన్నారు వెంకటేష్. లీడర్ నుండి అరణ్య వరకు రానా నటుడిగా చాలా ఎత్తుకి ఎదిగాడని.. అరణ్యలో రానా ది బెస్ట్ ఇచ్చాడని అన్నారు వెంకటేష్. వెంకటేష్ ఈ రేంజ్ లో చెప్పారు అంటే అరణ్య సినిమాలో రానా తన నట విశ్వరూపం చూపించాడని తెలుస్తుంది.