
స్వప్న సినిమాస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమా జాతిరత్నాలు. ఈ సినిమాను శివరాత్రి సందర్భంగా రిలీజ్ చేశారు. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో జరిగింది. ఈ సందర్భంగా జాతిరత్నాలు టీం తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ఇక సినిమా హీరో నవీన్ పొలిశెట్టి తనని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు తన సంతోషాన్ని తెలిపాడు.
ఆ హీరో ఏ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అని చెప్పండంటూ నవీన్ పొలిశెట్టి తనదైన మాటలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక డైరక్టర్ అనుదీప్ తనకు చాలా మంచి చ్లోజ్ ఫ్రెండ్ అయ్యాడని చెప్పారు నవీన్. ఇక ప్రియదర్శి, రాహుల్ లతో కలిసి పనిచేయడం కూడా బాగుందని. జస్ట్ వాళ్లు చేసిన దానికి తను కేవలం రియాక్షన్ మాత్రమే ఇచ్చానని నవీన్ చాలా గొప్పగా మాట్లాడాడు. ఇక ఇదే వేదిక మీద యాంకర్ సుమ జాతిరత్నాలు సీక్వల్ ఏమైనా ఉందా అని అడిగింది. జాతిరత్నాలు 2 చేసే ఆలోచన ఉందా అని అడిగితే మైక్ అందుకున్న అనుదీప్ ఉంది.. తీస్తాను అంటూ చెప్పగా.. జాతిరత్నాలు 2 ఉంటుందని హీరో నవీన్ పొలిశెట్టి ఎనౌన్స్ చేశారు. మొత్తానికి జాతిరత్నాలు సినిమాకు సీక్వల్ అంతకుమించి అనిపించేలా ఉంటుందని అనుకుంటున్నారు.