స్టార్ హీరోయిన్ కథలు రాస్తుందా..?

లోకనాయకుడు కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ హీరోయిన్ గా మళ్లీ ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. కెరియర్ లో కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న అమ్మడు తెలుగులో వరుస సినిమాలతో అదరగొడుతుంది. రవితేజ క్రాక్ సూపర్ హిట్ కాగా త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ అంటూ రాబోతుంది శృతి హాసన్. సినిమాలతోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్న శృతి హాసన్ 2020 కరోనా లాక్ డౌన్ టైంలో తను కథలు కూడా రాసిందట.

హీరోయిన్ అవకముందే లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరక్టర్, సింగర్ గా సత్తా చాటిన శృతి హాసన్ ఇప్పుడు తనలోని కొత్త టాలెంట్ ను చూపిస్తుంది. హీరోయిన్స్ కథలు రాయడం కొత్తగా ఉంది. శృతి హాసన్ రాసిన కథలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయి. మరి కథలు రాయడం మొదలు పెట్టింది అంటే అమ్మడు డైరక్షన్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండే ఉంటుందని అనుకుంటున్నారు ఆడియెన్స్. శృతి హాసన్ లోని ఈ టాలెంట్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందా లేదా అన్నది తెలియాలంటే ఆమె కథ తెరకెక్కితేనే తెలుస్తుంది.