నితిన్ 'రంగ్ దే' ట్రైలర్.. ఇంప్రెసివ్..!

వెంకీ అట్లూరి డైరక్షన్ లో నితిన్, కీర్తి సురేష్ జంటగా నటించిన సినిమా రంగ్ దే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవరగ నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చ్ 26 రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే నితిన్ లోని కామెడీ టైమింగ్ తో.. కీర్తి సురేష్ టాలెంట్ కు తగినట్టు ఈ కథ ఉన్నట్టు తెలుసుతంది.

చెక్ తో ఘోర విఫలం పొందిన నితిన్ రంగ్ దే మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని చెప్పొచ్చు. నితిన్, కీర్తి సురేష్ ల జోడీ సినిమాకు చాలా ప్లస్ అయ్యేలా ఉంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని అనిపిస్తుంది. మరి మార్చ్ 26న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.