
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఎవర్ గ్రీన్ ప్రొడ్యూసర్ అని చెప్పొచ్చు. కొత్త తరం.. కొత్త అప్డేట్స్ వస్తున్నా.. ఆయన బిజినెస్ ఐడియాలజీ కూడా అలానే అప్డేట్ అవుతుంది. ఇన్నాళ్లు డిస్ట్రిబ్యూషన్, సినిమా ప్రొడక్షన్ మాత్రమే చేసిన ఆయన సొంత ఓటిటిని నిర్మించి సక్సెస్ చేశారు. కంప్లీట్ తెలుగు ఓటిటి యాప్ గా ఆహాకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆహా దూకుడికి అమేజాన్, నెట్ ఫ్లిక్స్ లు కూడా కంగారు పడేలా చేశారు.
ఇదిలాఉంటే ఆయన నిర్మించిన సినిమాలను కూడా ఆహాలో రిలీజ్ చేస్తూ సత్తా చాటుతున్నారు అల్లు అరవింద్. అయితే లేటెస్ట్ గా అల్లు అరవింద సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తున్న అఖిల్ బ్యాచ్ లర్ సినిమాకు మాత్రం సెపరేట్ ప్లాన్ చేశారు అల్లు అరవింద్. ఈ సినిమాను ఆహాలో రిలీజ్ చేయకుండా నెట్ ఫ్లిక్స్ వారికి సినిమా డిజిటల్ రైట్స్ అమ్మేసినట్టు తెలుస్తుంది. సొంత ఓటిటి ఫ్లాట్ ఫాం ఉన్నా సరే అఖిల్ సినిమాను మాత్రం నెట్ ఫ్లిక్స్ వారికి ఫ్యాన్సీ రేటికి డిజిటల్ రైట్స్ అమ్మేశారట. అఖిల్ మార్కెట్ ను అనుగుణంగా నెట్ ఫ్లిక్స్ అయితేనే బెటర్ అని అలా ఫిక్స్ చేసి ఉండొచ్చు. ఏది ఏమైనా సొంత ఓటిటి ఉంచుకుని తమ సినిమాను నెట్ ఫ్లిక్స్ కు అమ్మేయడం వెనక అరవింద్ గారి మాస్టర్ మైండ్ ఏంటో అందరికి అర్ధమవుతుంది.