సాయి ధరం తేజ్ తో మళయాళ భామ..!

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ త్వరలోనే రిపబ్లిక్ సినిమాతో రాబోతున్నాడని తెలిసిందే. ప్రస్థానం ఫేమ్ దేవా కట్ట డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది. జూన్ 4న ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ అసిస్టెంట్ కార్తికేయ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ కథ అందించడం విశేషం.

సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఈ మూవీని బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ గా మళయాళ భామ సంయుక్త మీనన్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మళయాళ భామలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంది. సంయుక్త చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవడం విశేషం. మళయాళంలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు సాయి ధరం తేజ్ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించాలని చూస్తుంది. సాయి ధరం తేజ్, సంయుక్త మీనన్ ల జోడీ సినిమాకు ఎంత ప్లస్ అవుతుంది అన్నది చూడాలి.