
రుద్రమదేవి సినిమాతో తన సత్తా చాటిన డైరక్టర్ గుణశేఖర్ లేటెస్ట్ గా శాకుంతలం సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు, గుణ టీం వర్క్స్ కలిసి చేస్తున్న ఈ సినిమాలో టైటిల్ రోల్ పోశిస్తున్నారు సమంత. మహాభారతం ఆదిపర్వంలోని ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో దుష్యంతుడిగా మళయాళ స్టార్ దేవ్ మోహన్ నటిస్తున్నారు.
ఇక సినిమాలో దుర్వాస మహాముని పాత్రలో కలక్షన్ కింగ్ మోహన్ బాబుని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో మరిన్ని ఇంట్రెస్టింగ్ క్యారక్టర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. 50 సినిమాల తన జర్నీలో మైథలాజికల్ మూవీ చేయలేదన్న లోటు ఈ సినిమాతో తీరుతుందని అంటున్నారు సమంత. ఈ సినిమాతో సమంత సోలోగా పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నట్టు తెలుస్తుంది.