
బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ తెలుగు రీమేక్ గా వస్తున్న సినిమా వకీల్ సాబ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను వేణు శ్రీరాం డైరెక్ట్ చేస్తున్నారు. పింక్ మూల కథను తీసుకుని దాన్ని పవన్ ఇమేజ్ కు తగినట్టుగా మార్చి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న వకీల్ సాబ్ సినిమాలోని రిలీజైన మూడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 3న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ ఉంటుందని తెలుస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారని టాక్. చిరుతో పాటుగా బాబాయ్ సినిమాకు తన బెస్ట్ విసెష్ అందించేందుకు రాం చరణ్ కూడా వస్తాడని తెలుస్తుంది. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మెగా ఈవెంట్ మెగా, పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషి చేసేలా ఉంటుందని తెలుస్తుంది.