
అనీల్ రావిపుడి డైరక్షన్ లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ఎఫ్2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. ఎఫ్2 హిట్ అవడంతో ఎఫ్3 సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సీక్వల్ సినిమాకు సంబందించి ఓ క్రేజీ అప్డేట్ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ కు షాక్ ఇస్తుంది.
సినిమాలో వెంకటేష్ కు రే చీకటి ఉంటుందట. దాని ద్వారా అనీల్ రావిపుడి కామెడీ పండిస్తాడని తెలుస్తుంది. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు సూపర్ హిట్లు కొడుతున్న అనీల్ రావిపుడి ఎఫ్3తో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఆగష్టు 27న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నవ్వుల వ్యాక్సిన్ ఇవ్వడం పక్కా అని చిత్రయూనిట్ అంటున్నారు.