
కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఈమధ్య తెలుగులో కూడా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. మాస్టర్ తెలుగు డబ్బింగ్ వర్షన్ తో మెప్పించగా.. రీసెంట్ గా వచ్చిన ఉప్పెన సినిమాలో రాయణం పాత్రలో తన సత్తా చాటాడు విజయ్ సేతుపతి. ఉప్పెన సినిమాలో ఆయన పాత్ర.. అభినయం చూసి తెలుగు దర్శకులు అతని కోసం పాత్రలు రాస్తున్నారట. ఈ క్రమంలో మాస్ మహరాజ్ రవితేజతో విజయ్ సేతుపతి నటిస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
మళయాళ సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని కొన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. పృధ్వి రాజ్, సూరజ్ నటించిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలో రవితేజ పృధ్వి రాజ్ పాత్రలో నటిస్తాడని తెలుస్తుండగా.. సూరజ్ పాత్రలో విజయ్ సేతుపతిని తీసుకున్నారని టాక్. మరి ఈ ప్రాజెక్ట్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు. మిగతా స్టార్ కాస్ట్ ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కన్ ఫాం అయితే మాత్రం మరో క్రేజీ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పొచ్చు.