
కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా నూతన దర్శకుడు మణికాంత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా తెల్లవారితే గురువారం. ఈ సినిమాను వారాహి చలన చిత్ర, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సాయి కొర్రపాట్, రవీంద్ర బెనర్జీ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాలో హీరోయిన్స్ గా చిత్రా శుక్లా, మిషా నారంగ్ నటిస్తున్నారు. ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసింది.
మార్చ్ 27న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మార్చ్ 21న ఫిక్స్ చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి, ఎన్.టి.ఆర్ వస్తారని తెలుస్తుంది. కీరవాణి కోసం రాజమౌళి రాక తప్పదు కాని తారక్ ను కూడా ఒప్పించి సినిమాకు క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి మరో తనయుడు కాళ భైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీ సింహా నటించిన మత్తు వదలరా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తున్న శ్రీ సింహా తెల్లవారితే గురువారం ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.