విరాటపర్వం టీజర్ రిలీజ్ చేసిన మెగాస్టార్..!

నీది నాది ఒకే కథ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరక్టర్ వేణు ఊడిగుల రానా హీరోగా విరాట పర్వం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. సాయి పల్లవి ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. విరాట పర్వం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేయడం విశేషం. ఈ టీజర్ లాంచ్ చేసిన చిరు సినిమా అద్భుతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

రానాకు మంచి హిట్ ఇవ్వాలని కోరారు. ఇక దర్శకుడి పనితనం చూస్తుంటే ఒకప్పటి టి కృష్ణ తనకు గుర్తుకు వస్తున్నారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇలాంటి కథలను ఎంచుకోవడం చాలా కష్టమని.. డైరక్టర్ వేణు తప్పకుండా మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకుంటాడని అన్నారు చిరంజీవి. తన ఆచార్య సినిమా కూడా నక్సల్స్ బ్యాక్ డ్రాప్ తోనే వస్తుందని. యూనిక్ సబ్జెక్ట్ తో వస్తున్న విరాటపర్వం హిట్ తమ సినిమాకు మంచి బూస్టింగ్ ఇస్తుందని అన్నారు. 

ఇక టీజర్ విషయానికి వస్తే.. కామ్రేడ్ రవన్న పాత్రలో రానా అదరగొట్టేలా ఉన్నాడు. ఇక అతన్ని ప్రేమించే అమ్మాయిగా సాయి పల్లవి మరోసారి కెరియర్ లో నిలిచిపోయే పాత్ర చేసిందని అనిపిస్తుంది. ప్రేమ.. నక్సలిజం వీటి మధ్య నడిచే కథ విరాట పర్వం. టీజర్ అంచనాలు పెంచగా ట్రైలర్.. ఆ తర్వాత సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.