ఆది ఈ సినిమా అయినా..?

సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా శ్రీనివాస్ నాయుడు డైరక్షన్ లో వస్తున్న సినిమా శశి. ప్రేమకావాలి సినిమా నుండి జోడీ వరకు ప్రేక్షకులను అలరించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆది శశి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో ఆది సరసన సురభి హీరోయిన్ గా నటించింది. 

కొన్నాళ్లుగా సినిమాలైతే తీస్తున్నాడు కాని హిట్ కు దూరంగా ఉంటూ వస్తున్న ఆది శశి సినిమాతో టార్గెట్ హిట్ పెట్టుకున్నాడు. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా తక్కువగా జరిగినట్టు తెలుస్తుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో 3 కోట్లు.. వరల్డ్ వైడ్ గా 3.25 కోట్ల బిజినెస్ చేసింది. శశి హిట్ అవ్వాలంటే మాత్రం 3.5 కోట్లు రాబట్టాల్సి ఉంది. మొత్తానికి శశి సినిమాతో అయినా ఆది తన టార్గెట్ రీచ్ అవుతాడో లేదో చూడాలి.