ఆహాలో గాలి సంపత్..!

తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫాం ఆహా లో బడ్జెట్ తెలుగు సినిమాలకు బెస్ట్ ఆప్షన్ గా మారింది. డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేసే సినిమాలతో పాటుగా థియేట్రికల్ రిలీజైన సినిమాలను కూడా ఆహాలో దించేస్తున్నారు. మార్చ్ 11న రిలీజైన గాలి సంపత్ సినిమా కూడా ఆహాలో రిలీజ్ అవుతుంది. జాతిరతాలు, శ్రీకారం, గాలి సంపత్ మూడు సినిమాలు శివరాత్రి సందర్భంగా రిలీజ్ అయ్యాయి. జాతిరత్నాలు, శ్రీకారం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా.. గాలి సంపత్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్స్ లో నటించిన గాలి సంపత్ సినిమాను అనీష్ కృష్ణ డైరెక్ట్ చేశారు. అనీల్ రావిపుడి కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.   

గాలి సంపత్ సినిమాను ఆహా 2 కోట్లకు కొనేసినట్టు తెలుస్తుంది. 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన గాలి సంపత్ ఐదున్నర కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపగా డిజిటల్ రైట్స్ ఆహా కొనేసింది. శాటిలైట్ రైట్స్ కూడా చర్చల దశల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఆహాలో గాలి సంపత్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. అయితే రిలీజైన వారం, పదిరోజుల్లోనే ఆహాలో వస్తున్న సినిమాగా గాలి సంపత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. అయితే థియేటర్ లో సక్సెస్ అవని ఈ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫాం మీద ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి.