
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం డైరక్షన్ లో వస్తున్న సినిమా వకీల్ సాబ్. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ మగువ సాంగ్ తో అదరగొట్టిన థమన్ రీసెంట్ గా జనగణమన అంటూ పవర్ స్టార్ ఇమేజ్ కు తగినట్టుగా సాంగ్ తో సూపర్ అనిపించాడు. ఇక లేటెస్ట్ గా వకీల్ సాబ్ నుండి థర్డ్ సాంగ్ రిలీజ్ చేశారు.
కంటిపాప.. కంటిపాప లిరిక్ తో వచ్చిన ఈ సాంగ్ తో కూడా థమన్ మరోసారి మెప్పించాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అర్మన్ మాలిక్, దీపు ఆలపించారు. థమన్ మ్యూజిక్ డైరక్షన్ లో సినిమా అంటే ఆల్బం సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఈమధ్య తన వర్క్ ఉంటుంది. మ్యూజిక్ పరంగా సినిమాకు కావాల్సినంత సపోర్ట్ ఇస్తున్నాడు థమన్. వకీల్ సాబ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. రిలీజైన 3 సాంగ్స్ సూపర్ అనిపించుకోగా సినిమాతో పాటు మ్యూజిక్ పరంగా కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ అయ్యేలా చేస్తున్నారు.