
త్వరలో వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కింగ్ నాగార్జున తన నెక్స్ట్ సినిమాలతో కూడా బిజీగా ఉన్నాడు. వైల్డ్ డాగ్ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు నాగార్జున. రీసెంట్ గా సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమాలో నాగ్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని సెలెక్ట్ చేశారట.
పెళ్లి తర్వాత కూడా కాజల్ వరుస సినిమాలు చేస్తుంది. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న అమ్మడు లేటెస్ట్ గా కింగ్ నాగార్జున సినిమా ఛాన్స్ కూడా అందుకుందని తెలుస్తుంది. తండ్రి కొడుకుల సరసన నటించిన హీరోయిన్స్ లిస్ట్ లో కూడా కాజల్ పేరు చేరింది. అటు రాం చరణ్, ఇటు చిరంజీవితో నటించిన కాజల్.. ఆల్రెడీ నాగ చైతన్యతో దడ సినిమాలో చేయగా ఇప్పుడు నాగ్ సరసన ఛాన్స్ కొట్టేసింది. మొత్తానికి పెళ్లి తర్వాత సీనియర్ హీరోల సినిమాలతో కెరియర్ కొనసాగిస్తుంది అమ్మడు.