
సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన భామ నభా నటేష్. పూరె జగన్నాథ్ డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నభా నటేష్ వరుస అవకాశాలు అందుకుంది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న నభా నటేష్ అక్కినేని నాగ చైతన్య సరసన నటించే ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.
శేఖర్ కమ్ముల డైరక్షన్ లో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న చైతు ఈ సినిమా తర్వాత విక్రం కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేష్ కు ఛాన్స్ ఇచ్చారట. సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నభా నటేష్ ఆ సినిమాలతో అలరించలేకపోయింది. మరి చైతు థ్యాంక్ యుతో అయినా అమ్మడికి లక్ కలిసి వస్తుందేమో చూడాలి.