200 కోట్లతో బాహుబలి 3..!

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ లు ఏ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే. తెలుగు సినిమా స్టామినా ఏంటన్నది బాహుబలితో ప్రూవ్ చేశాడు రాజమౌళి. బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ వారు బాహుబలి సినిమాకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు బాహుబలి బిఫోర్ బిగినింగ్ అంటూ ఓ వెబ్ సీరీస్ చేయాలని అనుకున్నారు.

ఆనంద్ నీలకంఠన్ రాసిన ది రైజ్ ఆఫ్ శివగామి ఆధారంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. టాలీవుడ్ డైరక్టర్స్ దేవా కట్టా, ప్రవీణ్ సత్తారులతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. 100 కోట్ల బడ్జెట్ తో భారీ స్థాయిలో ఈ వెబ్ సీరీస్ ప్లాన్ చేశారు. కాని అనుకున్న విధంగా అవుట్ పుట్ రాకపోవడంతో నెట్ ఫ్లిక్స్ వారు ఆ ప్రాజెక్ట్ ను ఆపేశారు. అయితే ముందు 100 కోట్ల బడ్జెట్ తో అనుకున్న ఈ వెబ్ సీరీస్ కాస్త ఇప్పుడు 200 కోట్లతో ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి ఆధ్వర్యంలో బాహుబలికి పనిచేసిన వారితోనే.. ఈ వెబ్ సీరీస్ తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ ను 9 ఎపిసోడ్స్ గా తొలి సీజన్ ఉంటుందని టాక్. అయితే ఈ వెబ్ సీరీస్ డైరక్టర్ ఎవరు.. నటీనటులు ఎవరన్నది తెలియాల్సి ఉంది.