ఎన్.టి.ఆర్, త్రివిక్రం.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రం ఇద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. అరవింద సమేత తర్వాత ఈ కాంబో మూవీ అనగానే ఆడియెన్స్ లో అంచనాలు పెరిగాయి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమాగా కూడా త్రివిక్రం సినిమాపై స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ముందు ఒక కథ ఓకే అనుకున్నా అది వర్క్ అవుట్ అవుతుందో లేదో అన్న ఆలోచనతో మరో కథ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఏప్రిల్ ఎండింగ్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్. మే, జూన్ మొత్తం తారక్ త్రివిక్రం మూవీకి డేట్స్ ఇచ్చారట. ఇయర్ ఎండింగ్ కల్లా షూటింగ్ పూర్తి చేసి 2022 ఏప్రిల్ 29న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈమధ్య స్టార్ సినిమాలు ఓపెనింగ్ రోజే రిలీజ్ డేట్ లు ప్రకటిస్తున్నారు. రిలీజ్ క్లాషులు రాకుండా జాగ్రత్త పడాలనే ఆలోచనో మరే కారణమో తెలియదు కాని 2022 సంక్రాంతికి ఆల్రెడీ మహేష్ సకారు వారి పాట, పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక సమ్మర్ కు ప్రభాస్ సలార్ రిలీజ్ ఎనౌన్స్ చేయగా అదే ఏప్రిల్ లో ఎన్.టి.ఆర్, త్రివిక్రం సినిమా వస్తుందని తెలుస్తుంది. మొత్తానికి 2021 మాత్రమే కాదు 2022 కూడా సినీ అభిమానులకు పండుగే అన్నమాట.