నవీన్ పొలిశెట్టి లక్ అలా ఉంది.. అనుష్క మూవీ ఛాన్స్..!

శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఓ పాత్రలో నటించిన నవీన్ పొలిశెట్టి సూపర్ స్టార్ మహేష్ 1 నేనొక్కడినే సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. అతను లీడ్ రోల్ గా 2019లో వచ్చిన సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ. ఆ సినిమాతో నవీన్ పొలిశెట్టి తన సత్తా చాటాడు. లేటెస్ట్ గా అతను హీరోగా వచ్చిన జాతిరత్నాలు సినిమా కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది. 

సినిమా తర్వాత నవీన్ పొలిశెట్టికి సూపర్ ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది. అందులో ఒకటి అనుష్క సినిమా కూడా ఉందని టాక్. యువి క్రియేషన్స్ బ్యానర్ అనుష్క ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టిని తీసుకోవాలని అనుకుంటున్నారు. నవీన్ కూడా అనుష్క సరసన చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే జాతిరత్నాలు హిట్ అవడంతో నవీన్ పాత్ర ముందు అనుకున్న దానికన్నా కొద్దిగా పెంచినట్టు టాక్. మొత్తానికి రెండు సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నవీన్ అనుష్క తో నటించే ఛాన్స్ కొట్టేశాడు.