
కె.జి.ఎఫ్ 2 తర్వాత డైరక్టర్ ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ఒక షెడ్యూల్ పూర్తయింది. రాధే శ్యాం షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్ సలార్, ఆదిపురుష్ రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఒక నెల ఆ సినిమాకు.. ఒక ఈ సినిమాకు అన్నట్టుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు ప్రభాస్.
సలార్ సినిమాను కె.జి.ఎఫ్ ను మించి తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ సినిమా కోల్ మైన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫిక్స్ చేయగా సలార్ లో స్పెషల్ సాంగ్ కోసం కె.జి.ఎఫ్ భామ శ్రీనిధి శెట్టిని సెలెక్ట్ చేశారట. కె.జి.ఎఫ్ పార్ట్ 1 లో తన అందంతో అలరించిన శ్రీనిధి సలార్ లో ప్రభాస్ తో స్పెషల్ ఐటం సాంగ్ కు సై అన్నది. ఈ సినిమాతో అమ్మడికి తెలుగులో కూడా అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.