ఆ డేట్ న సర్కారు వారి పాట రిలీజ్..?

సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్నారు. మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాను 2021 జనవరి నుండి సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది.

షూటింగ్ కు వెళ్ళకుండానే ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారని తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం 2021 ఆగష్టు 7న సర్కారు వారి పాట రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మహేష్ కొరటాల శివ కాంబోలో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఆరోజే రిలీజైంది. అదే సెంటిమెంట్ తో మహేష్ సర్కారు వారి పాట సినిమాను ఆ డేట్ న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మహేష్ తో సినిమా ఆరు నెలల్లో షూటింగ్ ఎనిమిది నెలల్లో రిలీజ్ జరిగే పనేనా అన్నది చూడాలి.